--
హిప్నాటిజం ప్రదర్శించడానికి మంత్రాలు, తంత్రాలు, యంత్రాలూ,ఇంద్రజాలం, వశీకరణం, సమ్మోహనశక్తి, టక్కుటమార, గజకర్ణ గోకర్ణ విద్యల అవసరం లేదని మీరీపాటికి గ్రహించి ఉంటారు. అయితే మరి ఈ విద్యలు అవసరం లేకుండా మందులు, మాకులు లేకుండా దీర్ఘ రోగాలను ఎలా నయం చేస్తారు? అనే అనుమానం మీకు రావొచ్చు. నిజానికి హిప్నాటిజం ద్వారా కొంతమంది నకిలీ డాక్టర్లు ప్రచారం చేస్తున్నట్లుగా డాక్టర్లకు నయంకాని దీర్ఘవ్యాధులు నయంకావు. ఆడవాళ్ళ వంపుసొంపులు పెరుగుతాయనీ, పొట్టివాళ్ళు పొడుగు అవుతారనీ చేసుకునే ప్రకటనలలో ఏ మాత్రమూ సత్యం లేదు. కేవలం మానసికంగా బలహీనంగా ఉండటం వలన వచ్చిన అవలక్షణాలు, భయాలు, ఆందోళనలు మాత్రమే హిప్నోథెరపీ ద్వారా నయం కాగలవు. అయితే అవి శారీరక రుగ్మతలు మాత్రం కాకూడదు.
Title | వైజ్ఞానిక హిప్నాటిజం |
Writer | డా. బి.వి.పట్టాభిరామ్ |
Category | సెల్ప్ హెల్ప్ |
Stock | 100 |
ISBN | 978-93-85829-47-5 |
Book Id | EBO082 |
Pages | 144 |
Release Date | 17-Mar-2015 |