వైఫల్యాలు నేర్పే పాఠాలు విజయాలకు పునాదులని మీకు తెలుసు. అయితే వైఫల్యాలనుంచి పాఠాలు నేర్చుకోవడంలోనే మనం వైఫల్యం చెందుతుంటాం. మన వైఫల్యాలకు కారణాలు వెతుక్కుంటూ విజయాలకు మాత్రం మనమే సొంతదారులైనట్లు ప్రవరిస్తుంటాం. మన వైఫల్యాలకి కచ్చితంగా మనమే కారణం. కానీ మన విజయాలకు మాత్రం మనచుట్టూ వున్న పరిసరాలు, మిత్రులు, పరిస్థితులు కారణం. ఈ ఒక్క నిజాన్ని నిజాయితీగా మనం గ్రహించగలిగితే అదే పెద్ద విజయం. మన మీద మనం సాధించే గెలుపు. ఆ గెలుపు మనల్ని ఎంతో ముందుకు నడిపిస్తుంది. అలా గెలిచే సత్తా మనందరికీ ఉంది.