సైన్స్ మేజిక్
మనోల్లాసానికి, ప్రేక్షకులలో సంభ్ర మాశ్చర్యాలు రేకెత్తించటానికి దోహదం చేసే మేజిక్ కళ అందరికీ తెలిసి ఉండటం చాలా అవసరం. అది జరిగిన నాడు మనకు పారంపర్యంగా వస్తున్న అనేక మూఢ నమ్మకాలు వాటంతట అవే తొలగిపోతాయి. డా. బి.వి. పట్టాభిరామ్ మెజీషియన్‌గా ప్రపంచ ప్రసిద్ధులు. ఈ పుస్తకాలలో ఆయన మేజిక్ విజ్ఞానానికి సంబంధించిన అనేక అంశాలను చర్చించడంతో పాటు, మీ అందరికి అర్థమయ్యేలాగ అనేక మేజిక్‌లను ఎలా చేయాలో సచిత్రంగా వివరించారు. మేజిక్ గురించి తెలుసుకోవాలనుకొనేవారికి, నేర్చుకుందామనుకొనే వారికి ఈ పుస్తకం కరదీపిక.