తానుచూడని ప్రదేశం కూడా, కళ్లకు కట్టినట్లు విద్యార్థులకు చూపించగలిగే అద్భుత వ్యక్తి ఉపాధ్యాయుడు” అన్నాడు ఒక మేధావి. ఆ మేధావి మాత్రమే కాదు, మీరూ, నేను అంగీకరించాల్సిన వాస్తవం అది.
ప్రపంచంలో క్రీస్తు పూర్వమే మనకు విద్యాలయాలే కాదు, విశ్వవిద్యాలయాలున్నా వాటిల్లో చదువుకోవటానికి దాదాపు అరవై దేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారని మన పిల్లలకు తెలియకపోవచ్చు. తక్షశిల, నలందా విశ్వవిద్యాలయాల్లోని అమూల్యగ్రంథాలు ఎందరో విదేశీ దండయాత్రలు చేసి తస్కరించారని అసలే తెలియదు. ఇది చారిత్రిక సత్యం.
Title | ఉపాధ్యాయులకు విజయసూత్రాలు |
Writer | డా. బి.వి.పట్టాభిరామ్ |
Category | సెల్ప్ హెల్ప్ |
Stock | Available |
ISBN | 978-93-88492-68-3 |
Book Id | EBT001 |
Pages | 110 |
Release Date | 01-Jan-2020 |