నేనూ నా ఫ్రండ్ జూలీ కలషి జీవిస్తున్నాము! మా ఇద్దరికీ ఆలోచనల యందు తేడాలు వచ్చిన మేము విడిపోదుము, సో… విడిపోవు వరకు ఆనందముగా, సుఖముగా కాపురము షేషుకొందుము. మేము స్నేహితులము కనుక ఒకరిని ఒకరు గౌరవించుకొనెదము. పెండ్లి షేషుకుని మొగుడూ పెండ్లాములయిన ఒకరిమీద ఒకరికి గౌరవము ఉండదు. తిట్టుకుని, కొట్టుకుని కలసి ఉందురు.
పెళ్ళి అయిన తర్వాత సీతకీ, తనకీ మధ్య ప్రేమ, ఆకర్షణా తగ్గిపోతాయా? ఇద్దరూ దెబ్బలాడుకుంటారా?
సుందర్ మాటలకు ఆలోచనలోపడిన బుచ్చిబాబు తన ప్రియురాలి సీతతో పెళ్లి కాకుండానే కాపురం పెట్టిన తీరు ఎలా ఉంది?
కామెడీ కింగ్ మల్లిక్ కలం నుండి
సిల్లీగా జాలువారిన నవ్వుల పందిరి.
సిల్లీఫెలో