మల్లిక్ పేరు వినగానే పెదాల మీద చిరునవ్వు కదలాడుతుంది. మల్లిక్ రాసిన కథను గురించి పరిచయం చేయడం సాహసమే అవుతుంది. ఎందుకంటే అడుగడుగునా హాస్యం పండే కథలలో ఇదిగో ఇక్కడుంది హాస్యం అని ఒక పేరాని పరిచయం చేసి ఊరుకోలేం. అలా పుస్తకం అంతా ఇక్కడే ఇవ్వలేం. అసలు ప్రతికథలో సహస్రరసాలు పండించగల దిట్ట ఆయన. ‘జగమెరిగిన బ్రహ్మణుడికి జంధ్యమేల’ చెప్పండి. నిజానికి మాకన్నా మీరే మల్లిక్ గురించి చెప్పగల దిట్టలు. మరింకేం….
పరుగో పరుగు అంటూ నవ్వుల రేసు పాల్గొనండి…