--
''సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త!''
''విద్య యొసగును వినయంబు! వినయమునను బడయుఁ బాత్రత!''
''జీవితం ఒక స్వప్నం వంటిదయ్యా!''
''జ్ఞానం లేని మనుష్యుడు పశువుతో సమానం!''
ఈలాంటి రత్నాలు అవధాన్లుగారి నోట ఎన్ని వస్తూ ఉండేవో! ఇవన్నీ మాదిగ చంద్రయ్య జీవితంలో అంకితమరుపోయారు.
అందుకనే చంద్రయ్య కొడుకును ఊళ్ళో ఉన్న కిరస్తానీ బడికి పంపాడు. కిరస్తానీ బడుల ముఖ్యోద్దేశము కిరస్తానీ మతాన్ని లోకంపై చల్లడమే. ఏది ఉద్దేశమరుతేనేమి విద్య ఏదోరకంగా ప్రవహిస్తోంది. ఆ ప్రవాహం నీరు స్పష్టమరున జలం కానేకాదు. ఏ పాఠశాలలోనరునా నిర్మల విద్యానీరాలు ప్రవహిస్తున్నారు గనుకనా! స్థానిక ప్రభుత్వసంస్థలు నెలకొల్పిన ప్రాథమిక పాఠశాలలోనూ అంతే, వీథులలోనూ అంతే!
Title | నరుడు |
Writer | అడివి బాపిరాజు |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | 978-93-85231-65-0 |
Book Id | EBO043 |
Pages | 112 |
Release Date | 10-Feb-2015 |