--
కృష్ణవేణి ప్రవాహమున నీడ చూచుకొనుచున్న శ్రీ ధాన్యకటక దుర్గాధిలక్ష్మికి, వణిక్సార్వభౌముడగు చారుగుప్తుని మహాసౌధము శ్రవణావతంసమై విరాజిల్లుచుండెను. అచట కిన్నూరు ధనువుల దూరమందున్న మహాసంఘారామచైత్యమును, చారుగుప్తుని సౌధమును చక్కదనమున నక్కా సెల్లెండ్రవలె నున్నవి. నున్ననై నిగనిగలాడుచూ పాలరాతిగోడలపై చిత్రించిన బుద్ధదేవ జాతక గాథలతో నలరారు చారుగుప్తప్రాసాదము కనులు చల్లజేయుచూ రూపెత్తిన శిల్పలక్ష్మివలె నున్నది.
చారుగుప్తుడానాడు వ్యాఘ్రాజినము పఱచిన దంతపుబీటపై నధివసించి, తూలికోపధానములపై నొఱగి, గోష్ఠపాలకుడగు నింద్రగోపునితో సంభాషించుచుండెను.
Title | హిమబిందు |
Writer | అడివి బాపిరాజు |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Not Available |
ISBN | 978-93-85231-61-2 |
Book Id | EBO037 |
Pages | 384 |
Release Date | 04-Feb-2015 |