ఎమెస్కో అభిమానుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు వెబ్ సైట్ త్వరలో సిద్ధం అవుతుంది. ప్రస్తుతం వెబ్ టెస్టింగ్ జరుగుతున్నందున ఎవరూ కొనుగోలుకు ప్రయత్నించవద్దు. త్వరలోనే ప్రారంభ తేదిని తెలియపరచుతాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎప్పటి వలెనె అమెజాన్‌లో లభిస్తాయి.    
చక్రనేమి

Chkranemi

ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి

Arikepoodi(Kowdoori)Kowshyalya Deviరూ. 150


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


అతను కుటుంబ బాధ్యతల్లో తలమునకలయిన వ్యక్తి – ఆనందమయమయిన జీవితానికై అపురూపమయిన కలల్ని మనస్సులో పేర్చుకుంటున్నా – జీవితం ఒక పెద్ద సవాలు అయి అతనిముందు నిలిచింది. దాని నుంచి తప్పించుకొనే మార్గం లేదు -

ఆమె ఆగర్భ శ్రీమంతురాలు. బాధ్యతలు, బాదరబందీ లేకుండా స్వచ్ఛమయిన గులాబి పువ్వులాగ ఈ లోకంలో కన్ను విప్పింది. మమతా మాధుర్యాలను కురిపించగల ఆత్మీయుల నీడల్లో అల్లారుముద్దుగా పెరిగింది -

అతని తల్లి సనాతన సంప్రదాయల నుండి వేరుపడలేక అదే ప్రపంచమని నమ్మిన పాతకాలపు మనిషి -

ఆమె తండ్రి ఆధునిక ప్రపంచానికి ప్రతినిధి. మారే ప్రపంచానికి మారుతున్న కాలానికి అతని జీవితం సజీవ నిదర్శనం -

ఈ పాత కొత్తల మేలుకలయికగా, వారి ఇద్దరి జీవితాలూ ముడిపడ్డాయి. వారి ప్రేమానురాగాల విశ్వరూపమే – చక్రనేమి.

Books By This Author

Book Details


Titleచక్రనేమి
Writerఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN
Book IdSPI018
Pages 392
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
16686
137