ఎమెస్కో అభిమానుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు వెబ్ సైట్ త్వరలో సిద్ధం అవుతుంది. ప్రస్తుతం వెబ్ టెస్టింగ్ జరుగుతున్నందున ఎవరూ కొనుగోలుకు ప్రయత్నించవద్దు. త్వరలోనే ప్రారంభ తేదిని తెలియపరచుతాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎప్పటి వలెనె అమెజాన్‌లో లభిస్తాయి.    
అనిర్వచనీయం

Anirvachaniyam

ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి

Arikepoodi(Kowdoori)Kowshyalya Deviరూ. 50


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


మానవయంత్ర నిర్మాణం, దానికొచ్చే జబ్బులూ, బాగోగులూ, జననమరణాలూ, వగైరా వివరాలు అన్నీ తెలిసినా, మళ్ళీ మరణం ఎప్పటికప్పుడే క్రొత్తగా, భయంకరంగా కన్పిస్తుంది. ఏమిటిది?…యేమిటిది? ఈ లోకంలోకి వచ్చిన వెంటనే ఎందుకు తిరిగిపోయినట్టు ఆ పసివాడు? అన్నీ తనకే కావాలంటూ స్వంతంచేసుకొని, అందర్నీ వెళ్ళగొట్టుకున్న జయంతి ఈ బిడ్డ నాకేకావాలి, ‘ఈ భర్తనాదీ-పోవను వీల్లేదు’-అని ఎందుకు పట్టుకోలేకపోయింది, యేమిటీ మరణాల ఆవలితీరం?

”అంతగా యిహంలో అభిమానం విడచి ప్రాకులాడిన భాస్కర్‌ అంత త్వరగా-యేమీ పూర్తిగా అనుభవించకుండానే పరంలోకి ఎందుకు పారిపోయాడు? యేమిటీ మృత్యువు శక్తి?

”మానవుడు మృత్యువును జయించలేక లొంగిపోవటం సరే. కాని ఎందుకింత మాయాజాలంలో చిక్కుకొని బ్రతుకుతున్నాడు? అశాశ్వతమైన సుఖైశ్వర్యాలకోసం తెలిసీ కొట్టుమిట్టాడుతాడు. తప్పదని తెలిసీ మృత్యువుకు తయారుకాడు….! ఈ మృత్యువే లేకపోతే మానవులు యింకా అన్యాయాల్ని అధికంచేసి, మెత్తటివాళ్ళని బాధించి తామే రాజ్యమేలుదురు!

మనిషిని అదుపులోపెట్టి, బంధించి లాక్కుపోయే ఈ మరణమెంత అనిర్వచనీయమైనది!

సుప్రసిద్ధ రచయిత్రి  శ్రీమతి ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి రచన

Books By This Author

Book Details


Titleఅనిర్వచనీయం
Writerఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN
Book IdSPI016
Pages 112
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
19873
4132