--
'శ్రీకృష్ణదేవరాయలు' పేరు వినగానే తెలుగువారి ఒళ్లు పులకరిస్తుంది. ఎన్నెన్నో దివ్యానుభూతులను స్ఫురింపజేస్తుంది. ఏవేవో దివ్యలోకాల్లో విహరింపజేస్తుంది. తెలుగువారిని సదా ఉత్తేజపరిచే పేరు అది. తెలుగుజాతిని మేల్కొల్పే పేరు అది.తెలుగు ప్రజలున్న అన్నిచోట్లా నేటికీ శ్రీకృష్ణదేవరాయలు నిలిచే వున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, బయటి రాష్ట్రాల్లోకూడా తెలుగువారికి నేటికీ ఆయన స్ఫూర్తిదాత. తెలుగు భాషా సాహిత్యాలకు ఆయన చేసిన సేవే ఇందుకు కారణం. యుద్ధతంత్రంలో ఎంత నేర్పరో, సాహితీక్షేత్రం లోనూ అంతటి ప్రతిభాశాలి. సైనికబలంతోపాటు కవి దిగ్గజాలను కూడా తనతో తోడ్కొని వెళ్ళి యుద్ధ విరామ సమయాల్లో సాహితీగోష్ఠి జరిపిన రాజు మరొకరు మనకు చరిత్రలో కనిపించరు. అందుకే ఆయనను సాహితీ సమరాంగణ సార్వభౌముడు అన్నారు.
Title | శ్రీకృష్ణదేవరాయ వైభవం |
Writer | ఎమెస్కో |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | 978-93-86327-22-2 |
Book Id | EBG016 |
Pages | 576 |
Release Date | 14-Feb-2007 |