ఎప్పటికప్పుడు జరుగుతున్న సంఘటనలకు తక్షణ వ్యాఖ్యానంగా, విశ్లేషణగా రచించిన ‘ఇండియాగేట్’ కాలమ్ వ్యాసాలివి. అయితే వీటికి తాక్షణికతకు మించిన విలువే వుంది. సమకాలీన చరిత్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర రాజకీయాలు, వాటి మధ్య సంబంధాలు, వైరుధ్యాలు, వైషమ్యాలు అన్నీ తక్షణ చరిత్ర అవగాహనకే కాక దేశ భవిష్యత్ చరిత్రపట్ల అవగాహన నేర్పరచు కోవడానికీ, అంచనాలు వేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి.
దేశం ఎటు పోతూ ఉంది?
కవి, రచయిత, విమర్శకుడు అయిన ఒక సీనియర్ పాత్రికేయుని వ్యాఖ్యానం చదవండి.