నా హర్షిణి లేకుండా నేను జీవించగలనా? తెలీదు. కానీ, తప్పదు.
పాశ్చాత్య దేశాల్లో ‘చెదిరిన గూడు’ అనేది - ఒక మానసిక రుగ్మతకి దారితీసే పరిణామం. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతవరకూ ఏమీ అనిపించదు. వాళ్లకి రెక్కలు వచ్చి కెరీర్‌లు, కెరీర్‌లో ఎదిగే అవకాశాలు వెతుక్కుంటూ దూరంగా వెళ్లిపోతున్నప్పుడు ఆ తల్లిదండ్రులకి కలిగే మానసిక వేదన ఈ రుగ్మత.ఒక్కసారిగా ఒంటరితనం చుట్టుముడుతుంది.
ఏ పనీ చెయ్యబుద్ధి వెయ్యదు.