ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తిగారు విశ్వవిఖ్యాత తత్త్వవేత్తలు. పద్మ విభూషణ్ బిరుదాంకితులు. ఎన్నో విశ్వవిద్యాలయాలు వారికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసి గౌరవించాయి. 20వ శతాబ్ది భారతీయ తత్త్వవేత్తలలో పేరెన్నికగన్న సచ్చిదానందమూర్తిగారు తెలుగువారు కావడం తెలుగు వారందరూ గర్వించదగిన విషయం. డా।। సర్వేపల్లి రాధాకృష్ణన్ తత్త్వశాస్త్రంలో భారతదేశానికి ప్రపంచ వ్యాప్తమైన కీర్తి తెచ్చినవారు. సచ్చిదానందమూర్తిగారు డా।। సర్వేపల్లి రాధాకృష్ణన్ అభిమానం చూరగొన్నవారు.