ఆచార్య కూతాటి వెంకటరెడ్డి
K. Venkata Reddy
ఆచార్య కూతాటి వెంకటరెడ్డి 1931లో దనూజవారిపల్లి, గానుగపెంట గ్రామం, చిత్తూరు జిల్లాలో జన్మించారు. ఎం.ఏ (అర్థశాస్త్రం), మద్రాసు వి.వి. నుండి, పిహెచ్.డి., డిప్లమా ఇన్‌స్టాటిస్టిక్స్ శ్రీ వేంకటేశ్వర వి.వి. తిరుపతి నుండి పొందారు. విద్యార్థి దశలో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని 6 నెలల కారాగార వాసం అనుభవించారు. 1955-91 మధ్య కాలంలో శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల, తిరుపతి; ఆంధ్రవిశ్వవిద్యాలయం, విశాఖపట్టణం, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం లలో అధ్యాపకులుగా పనిచేశారు. 1982-85 మధ్య ఎస్.కె.వి.వి. రిజిస్ట్రారుగా, 1988-91 మధ్య వైస్‌చాన్సలర్‌గా పనిచేశారు. 20 గ్రంథాలు, 125 వ్యాసాలు ప్రచురించారు. 25గురు విద్యార్థులు వీరి పర్యవేక్షణలో పరిశోధన పట్టాలు పొందారు. వెంకటరెడ్డిగారు వివిధ దేశాల్లో పర్యటించారు. 1982 లో ఆం.ప్ర. ప్రభుత్వం నుండి ‘ఉత్తమ అధ్యాపక’ అవార్డు పొందారు. కవికోకిల రామిరెడ్డి ట్రస్టు ప్రముఖ సాంఘిక శాస్త్రవేత్త అవార్డును, గ్రామీణ ప్లానింగ్ పరిశోధన సంస్థ ‘విద్యాశిరోమణి’ (2015) అవార్డును ప్రదానం చేశాయి.