చలం విస్మరించిన రాజేశ్వరి బాల్యం
బుచ్చిబాబు 'చివరికి మిగిలేది'లో దయానిధి అస్తిత్వానికి ప్రేమించలేకపోవడం పునాది. చలం 'మైదానం'లో
రాజేశ్వరి అస్తిత్వానికి ప్రేమించబడకపోవడం పునాది. మైదానంలోని ముఖ్యమైన వ్యక్తులు : రాజేశ్వరి, ఆమె
భర్త, మామ, అమీర్, మీరా. ముఖ్య సంఘటనలు : రాజేశ్వరి అమీర్‌తో మైదానంలోకి లేచిపోవడం, మీరాతో
పరిచయం, గర్భం, గర్భస్రావం, అమీర్ మరణం, రాజేశ్వరి జైలుకెళ్ళడం మొదలగునవి. ఈ నవలని అర్థం
చేసుకునేందుకు యిందులోని వివిధ సన్నివేశాల వివరణా కాలక్రమాన్ని గుర్తించడం ముఖ్యం. ప్రధానంగా ఈ
నవలని చలం జైలులోని రాజేశ్వరి ఫ్లాష్‌బ్యాక్ ద్వారా వివరిస్తాడు. అమీర్ రాజేశ్వరుల కలయిక తర్వాత వాళ్ళు
లేచిపోవడంతో ఈ ఫ్లాష్‌బ్యాక్ వివరణ ప్రారంభమవుతుంది. ఈ నవలకు ఇది మూలసంఘటన. ఈ సంఘటన
తర్వాత జరిగే విషయాలనే నవలలో వివరిస్తాడు చలం. ఈ వివరణలో మనకు సాధారణంగా కనబడేది
కుటుంబ వ్యవస్థలోని ఛాందసత్వం. మైదానంలో స్వేచ్ఛ, రాజేశ్వరిని పట్టించుకోని ఆమె భర్త, నిరంతరం
సంపూర్ణంగా రాజేశ్వరిపైనే ధ్యాస కలిగిన అమీర్-ఈ వ్యత్యాసాలు రాజేశ్వరి అమీర్‌తో లేచిపోవడానికి కారణాలు.
ఈ అవగాహనతో ఈ నవలని అర్థం చేసుకున్నాం. ఈ అవగాహన సమంజసమే. కాని కేవలం ఈ అవగాహనకే
మనం నిర్ణీతం కావలసిన అవసరం లేదు. రాజేశ్వరి లేచిపోవడానికి గల మరికొన్ని కొత్త కారణాలు ఈ
నవలలోనే దొరుకుతాయి. ఈ కారణాల విశ్లేషణే ఈ వ్యాసం ఉద్దేశం.
Title | మైదానం లోతుల్లోకి |
Writer | రఘురామ రాజు అడ్లూరు |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | 978-93-86212-47-4 |
Book Id | EBC005 |
Pages | 96 |
Release Date | 10-Aug-2003 |