యం.శ్రీధర్ గారు ఆంగ్లంలో ఎన్నో కవితలు రాశారు. అవి అన్నీ ప్రసిద్ధాలయ్యాయి కూడా. ఒక తెలుగువాడు, అదీ తెలుగులో వచ్చిన భావజాలానికి ఆంగ్లరూపం ఇచ్చిన వాడు. నేరుగానే తెలుగులో కవితలు రాయగలవాడు.
‘మట్టికన్ను’ కవితా సంకలనంలో మనకు తన తెలుగు కవితలతో పాటు, ఒక్కప్పుడు ఆంగ్లంలో ప్రసిద్ధాలైన కవితల స్వీయ తెలుగు అనువాదం కనిపించడం ఈ సంకలనం ప్రత్యేకత.