--
గాథాసప్తశతిలోని ఒక్కొక్క గాథను తీసికొని దాని పూర్వాపరాలను ఊహించి ఒక కథనే అల్లవచ్చు. దీన్ని విస్తరించి ఒక కావ్యాన్నే కూర్చవచ్చునేమో కూడా. సప్తశతిలోని కొన్ని గాథలను తీసికొని సుప్రసిద్ధ పండితుడు, రచయిత తిరుమల రామచంద్రగారు అలా కథలు అల్లారు. ఒక పూర్వరంగాన్ని కూర్చి అందమైన భావానికి సన్నివేశాన్ని కూర్చారు. సన్నివేశాన్ని కథగా మలిచారు. కొన్ని గాథల్ని ఒకచోట కూర్చి వాటికొక సన్నివేశరూపాన్నిచ్చారు. సప్తశతి రమణీయ గాథలు తిరుమల రామచంద్రగారి కలంలో.
Title | ప్రాచీనాంధ్ర గాథలు |
Writer | డా. తిరుమల రామచంద్ర |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Not Available |
ISBN | 978-93-82203-75-9 |
Book Id | EBM055 |
Pages | 152 |
Release Date | 12-Feb-2013 |