--
నామ, రూప, గుణ రహితమైన భగవత్తత్త్వానికి మానవుడు ఒక నామాన్ని, ఒక రూపాన్ని, ఒక గుణాన్ని కల్పించి – ఒక దేవతామూర్తిని నిర్మించి – దాన్ని ధ్యానిస్తూ, పూజిస్తూ, సేవిస్తూ తన జన్మను పునీతం చేసుకొంటున్నాడు. ఈ దేవతా మూర్తులలో పిపీలికాది బ్రహ్మపర్యంతమన్నట్లుగా సమస్త పశుపక్ష్యాదుల రూపాలూ ఉండటం విశేషం. ఐతే మానవుడు ప్రధానంగా తన రూపంలోనే తన కన్న అతిశయించి ఉండే విధంగా మూడు తలలు, ఐదు తలలు, నాలుగు చేతులు, పది చేతులతో – దేవతాస్వరూపాలను నిర్మించుకొని, అర్చిస్తున్నాడు. అర్చించటమే కాదు తనను పోలివున్న ఆ భగవంతుడికి నిత్యమూ తనకు జరుగుతున్నట్లుగానే మేలుకొలుపులు, స్నానం, వస్త్రం, నైవేద్యం, అలంకారం, ఆసనం, శయ్య, పవళింపుసేవ ఇత్యాదులన్నింటినీ లౌకికంగా కాకుండా, వైదికంగా, మంత్రసహితంగా ఏర్పాటు చేసుకొని ఆ భగవదనుగ్రహానికి పాత్రుడౌతున్నాడు.
Title | శివకేశవమ్ |
Writer | గెడ్డాపు సత్యం |
Category | ఆధ్యాత్మికం |
Stock | Not Available |
ISBN | |
Book Id | EBK040 |
Pages | 114 |
Release Date | 03-Feb-2011 |