ఈ పుస్తకంలో తొమ్మిది పరిశోధన వ్యాసాలున్నాయి. మహాభారతం నుండి నేటివరకు వచ్చిన తెలుగు కావ్యాలలోని సామాజికాంశాలను ఈ వ్యాసాలు చర్చించాయి. మన సాహిత్యంలోని కావ్యాలలో విజ్ఞానసర్వస్వ లక్షణాలున్నాయని రచయిత ప్రతిపాదించాడు. తన ప్రతిపాదనను నిరూపించుకునే అనేక ఆధారాలను చూపించాడు. మనం సాహిత్యాన్ని అధ్యయనం చేసే విధానంలో ఒక నూతన దృక్పథాన్ని వెంకటరత్నంగారు ఈ వ్యాసాల్లో ప్రతిపాదించారు.
వెంకటరత్నం గారు కవి, విమర్శకుడు, నాటకకర్త, బహు గ్రంథ కర్త. వీరి రచనలనేకం ప్రచురితమయ్యాయి. మరెన్నో ప్రచురితం కావలసి ఉన్నాయి. ఆయన అనేక సన్మానాలు పొందారు.
Title | వ్యాస రత్న ప్రభావళి |
Writer | డా. గుంజి వేంకటరత్నం |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Available |
ISBN | 00 |
Book Id | EBT024 |
Pages | 94 |
Release Date | 01-Jan-2021 |