Patalu Puttina Thavulu
పాటలు పుట్టిన తావులు
AKKADA DEVUDU AAGI VINTUNNADU
అక్కడ దేవుడు ఆగి వింటున్నాడు
భావుకుడైన కవికి అనుభూతి నిత్యమే తప్ప క్వాచిత్కంకాదు. ఒక నెలరోజుల కాలంలో అవకాశం కల్పించుకొని సాహిత్య తీర్థయాత్ర చేసిన చినవీరభద్రుడు ఎన్ని కిలోమీటర్లు తిరిగాడో లెక్కించలేదు కాని రెండువేల సంవత్సరాలు మాత్రం ప్రయాణించాడు. తాను ప్రయాణించి పొందిన అనుభూతిని కొద్దిగంటల్లో చదువుకోగలిగేటట్లు ఈ రెండువందల ఇరవై రెండు పుటల్లో పాఠకులకు పంచగలిగాడు. అతని గాఢోద్వేగపు ప్రయాణంలో మనల్నీ భాగస్వాముల్ని చేశాడు. సంగం సాహిత్యంతో మొదలుపెట్టి నాయన్మార్లు, ఆళ్వార్లు, ఇళంగో అడిగళ్, అవ్వయ్యారు, తిరువళ్లువర్, అరవిందుడు, త్యాగరాజు, సుబ్రహ్మణ్యభారతి, రమణ మహర్షి, చలం అందరి కవిత్వ విశిష్టతనీ విశ్లేషించడమేకాక, వారి కవితల్ని రుచిచూపిస్తూ మనల్ని మరో సుగంధలోకంలోకి తీసుకొనివెళ్లాడు.
Title | పాటలు పుట్టిన తావులు |
Writer | వాడ్రేవు చినవీరభద్రుడు |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Available |
ISBN | -- |
Book Id | EBT006 |
Pages | 224 |
Release Date | 08-Feb-2020 |