శ్రీసూక్తులు
Sri Sukthulu
Tiruvalluvar
(Tirukkural)
తెలుగు అనువాదం
పి. కృష్ణయ్య
తమిళ సాహిత్యంలో అత్యంత ప్రధానమైన రచనల్లో తిరుక్కురళ్ ఒకటి. తెలుగు ద్విపదల్లాంటి రెండేసి చిన్నపాదాల పద్యాల సముదాయం కురళ్. దీనిలో 133 విషయాలున్నాయి. ఒక్కొక్కదానిపై పది కురళ్ లుంటాయి. మొత్తం 1330 పద్యాలు. రాజులు, స్నేహం, వ్యవసాయం, దేవుడు, సన్యాసులు, సజ్జనులు, గృహస్థులు, ఇల్లాలు, మంత్రులు, పరిపాలన, ప్రేమ, వర్షం - ఇలా లౌకిక ప్రపంచానికి సంబంధించి కురళ్ తడమని విషయం ఉండదు. చతుర్విధ పురుషార్థ సాధనను కురళ్ ప్రతిపాదిస్తుంది.ఎన్ని అనువాదాలు జరిగినా కురళ్ అనువాదకులను ఆకర్షిస్తూనే ఉంది. ఇప్పుడీ శ్రీ సూక్తులు కూడా ఆ వరుసలోదే. తిరుక్కురళ్‌లో తిరు - శ్రీ, కురళ్ - సూక్తులు అన్న అర్థంలో ఈ పేరు. కురళ్ వంటి సుందర కవితా రచనను ఛందోబద్ధంగా అనువదించడంలో పలు సమస్య లున్నాయి. మనం తీసికున్న ఛందంలో కురళ్ భావం ఇమడకపోవచ్చు లేదా ఛందస్సుకోసం కురళ్‌లో లేని మాటలూ భావాలూ చేర్చవలసి రావచ్చు. వచనానువాదంలో ఈ సమస్య ఉండదు. కాని ఇక్కడ కూడా అంత్య ప్రాసకోసం అదనపు మాటల అవసరం ఏర్పడుతుంది.
Title | శ్రీ సూక్తులు |
Writer | డా. పి. కృష్ణయ్య |
Category | ఆధ్యాత్మికం |
Stock | 100 |
ISBN | 978-93-86763-57-0 |
Book Id | EBR009 |
Pages | 152 |
Release Date | 30-Jan-2018 |