|
కాల్ చేయండి 040-23264028
లాగిన్లాగిన్ఇష్టమైనవికార్ట్
  1. హోమ్/
  2. మా గురించి
1950 నుండి తెలుగు సాహిత్య సేవలో

మా గురించి

నాకు జన్మనిచ్చింది ఎం.ఎన్. రావు గారు. ఇప్పుడు అందరికీ నేను ఎమెస్కోనే. తెలుగు నేలపై ప్రతి ఇల్లూ నా ఇల్లే. ఇన్నేళ్లుగా మీరు నన్ను ఆదరిస్తూ, అక్కున చేర్చుకుంటూనే ఉన్నారు. ఇప్పటివరకు నాలుగు వేలకు పైగా పుస్తకాల రూపంలో మీ చేతులకు చేరాను.

  • 1950

    స్థాపన

  • 6,000+

    ప్రచురించిన పుస్తకాలు

  • 500+

    రచయితలు

  • 75+

    ఏళ్ల సేవ

పాతకాలపు ముద్రణ యంత్రంపై పనిచేస్తున్న కార్మికులు
01

మా చరిత్ర

ఈ ఎనభై ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఎమెస్కో పాకెట్ బుక్స్ ద్వారా వేలాది నవలలను, సాహిత్య రచనలను మీ ముందుకు తెచ్చాను. ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’, ‘ఆధునికాంధ్ర సాహిత్యంలో అనర్ఘరత్నాలు’ శీర్షికలతో ప్రాచీన, ఆధునిక సాహిత్యాన్ని అతి తక్కువ ధరలకే మీకు అందించాను. పాకెట్ బుక్స్ నన్ను మీకు మరింత దగ్గర చేశాయి. గురజాడ ‘కన్యాశుల్కం’ నుండి అల్లసాని ‘మనుచరిత్ర’ వరకు ఎన్నో పుస్తకాలు ఎమెస్కో పాకెట్ బుక్స్ రూపంలో మీకు అందుబాటులోకి వచ్చాయి.

నేల నుండి పైకప్పు దాకా పుస్తకాల అరలతో అందమైన ఇంటి గ్రంథాలయం
02

బుక్ క్లబ్, ఇంటింటి గ్రంథాలయం

ఎమెస్కో బుక్ క్లబ్ ద్వారా యద్దనపూడి సులోచనారాణి, అరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి, పోల్కంపల్లి శాంతాదేవి, యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణమూర్తి, కొమ్మనాపల్లి గణపతిరావు, యర్రంశెట్టి సాయి వంటి ప్రముఖ రచయితల నవలలను ప్రతి నెలా మీకు అందించాను. ‘ఇంటింటి గ్రంథాలయం’ పథకం ద్వారా ఎమెస్కో ప్రచురణలనే కాక, రాష్ట్రంలోని ఎందరో ప్రచురణకర్తల పుస్తకాలను కూడా మీ ఇంటి ముంగిటకే చేర్చాను.

నాలుగు వేదాలు — ప్రాచీన పవిత్ర గ్రంథాలు
03

వేదాల ప్రచురణ

పేరొందిన రచయితల్లో చాలామంది పుస్తకాలు ఎమెస్కో ద్వారానే వెలుగు చూశాయంటే, అది మీ ప్రేమాభిమానాల చలవే. 2000 సంవత్సరంలో వేదాల ప్రచురణ ఎమెస్కో చరిత్రలోనే కాదు, తెలుగు పుస్తక ప్రచురణ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం! ప్రచురణకు ముందే ప్రకటించిన ఆఫర్‌లో 2,000కు పైగా సెట్లు అమ్ముడయ్యాయి — తెలుగులో వేదాల ప్రచురణకు కావలసిన ఆర్థిక వనరులను పాఠకులే సమకూర్చారు.

డిజిటల్ పఠనం, విద్య భవిష్యత్తు
04

భవిష్యత్తు వైపు

అక్షరం ఉన్నంత కాలం మీతో స్నేహం చేయాలన్నదే నా కోరిక. అందుకే కొత్త ఆలోచనలతో నన్ను నేను నిరంతరం కొత్తగా తీర్చిదిద్దుకుంటూ ఉంటాను. ఆధునిక తెలుగు భాషకు ఒక బృహత్ నిఘంటువును రూపొందించాలన్నది నా సంకల్పం. 2,00,000కు పైగా పదాలతో ఈ మహా నిఘంటువు నిర్మాణం ఇప్పుడు ఊపందుకుంది. ‘పొరుగు నుంచి తెలుగులోకి’ శీర్షికతో ఆధునిక భారతీయ ఆంగ్ల సాహిత్యంలోని ప్రసిద్ధ రచనలను తెలుగులోకి తీసుకొస్తున్నాం.

కలిసి ఆనందంగా చదువుకుంటున్న పిల్లలు
05

బాల సాహిత్యం

అంతర్జాతీయ ప్రమాణాలతో భారతీయ భాషల్లో బాల సాహిత్యాన్ని ప్రచురించాలని సంకల్పించాను. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒడియా, మరాఠీ భాషల్లో పిల్లల పుస్తకాల రచన ఊపందుకుంది. వాటి కోసం అందమైన బొమ్మలు కూడా సిద్ధమయ్యాయి. ఇప్పటికే 22 భారతీయ భాషల్లో 1,200కు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

ప్రాచీన గ్రంథాలు, తాళపత్ర ప్రతులు
06

అరుదైన, విశిష్ట గ్రంథాల పునర్ముద్రణ

తెలుగు నేలపై వెలువడి, ఇప్పుడు దొరకని విలువైన, ప్రసిద్ధ గ్రంథాలను మళ్లీ ప్రచురించే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. మొదటి విడతలో ‘కథలు-గాథలు’, ‘సాక్షి’, ‘కథాసరిత్సాగరం’, ‘ప్రపంచ చరిత్ర’ మీ చేతులకు చేరాయి. పుస్తక ప్రచురణ ఒక మహత్కార్యం. నేను కేవలం నిమిత్తమాత్రుణ్ని. ఈ ప్రచురణ యజ్ఞంలో పాఠకుల ప్రేమే హవిస్సు.

మీ తదుపరి పుస్తకాన్ని కనుగొనండి

తెలుగు పుస్తకాల పూర్తి జాబితాను చూడండి.

పుస్తకాలుసంకలనాలు
తెలుగు పుస్తకాల నిలయం

4,000కు పైగా పుస్తకాలు: క్లాసిక్స్, ఆధ్యాత్మిక గ్రంథాల నుండి పిల్లల కథల వరకు.

040-23264028emescohyd@gmail.com
సేకరణలుతాజా పుస్తకాలుప్రసిద్ధ పుస్తకాలు
మా గురించిమా గురించిరచయితలురద్దు మరియు కస్టమర్ సర్వీస్
కస్టమర్ సపోర్ట్రిటర్న్ విధానంరీఫండ్ విధానంచెల్లింపు విధానాలుమమ్మల్ని సంప్రదించండి
విధానాలు మరియు చట్టపరమైన అంశాలుగోప్యతా విధానంనిబంధనలు మరియు షరతులువాపసు మరియు మార్పిడి విధానంనిరాకరణ
ఎమెస్కో బుక్స్
© ఎమెస్కో బుక్స్ ప్రై. లిమిటెడ్ · హైదరాబాద్ · విజయవాడ · ప్రాజెక్ట్ కార్యాలయాలు: చెన్నై, మైసూరుగోప్యతనిబంధనలుషిప్పింగ్