వీరి తల్లిదండ్రులు మద్దాలి కనకవల్లి, వేంకటకృష్ణారావుగార్లు.
రచనావ్యాసంగం: 1936 నుంచి 40 వరకు ప్రజామిత్ర, ప్రజాబంధు, వాహిని, ఆంధ్రదైనిక్ సచిత్రవారపత్రికలు, చిత్ర గుప్త, ఢంకా, ఆనందవాణి, తెలుగుటాకీ. 1940లో చెన్నపట్నం వెళ్లి ‘‘గోభూమి’’ పత్రికలో పాత్రికేయ రచనాభ్యాసం. 1942లో బెంగుళూరులో ‘‘ఆంధ్రజ్యోతి’’ వారపత్రిక నిర్వాహక సంపాదకత్వం. 1943లో చెన్నపట్నం ‘‘ఆంధప్రభ’’లో సబ్‍ఎడిటరు. 1944లో హైదరాబాద్ ‘‘మీజాన్’’లో సబ్‍ఎడిటరు. 1944 చివరలోనే చెన్నపట్నం ‘‘ఆంధ్రపత్రిక’’లో సబ్‍ఎడిటరు. 1971లో ఛీఫ్ సబ్ ఎడిటరు. 1972లో అసిస్టెంట్ ఎడిటరు. 1973లో ఎడిటర్ ఇన్‍ఛార్జ్ (నిర్వాహక సంపాదకుడు). 1975లో అదే హోదాతో హైదరాబాద్ రాక, 1977 చివరిలో ఉద్యోగవిరమణ. తర్వాత వివిధ పత్రికలకు వ్యాసాలు ఆంధ్రపత్రికలో ‘‘రాజధాని ముచ్చట్లు’’, ‘‘హైదరాబాద్ సినిమాదృశ్యం’’ శీర్షికల నిర్వహణ. ఆంధ్రభూమి సినిమా పత్రికలో ‘‘ఉరుములు మెరుపులు’’ శీర్షిక నిర్వహణ. ఇంకా అడపాదడపా ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, నడుస్తున్న చరిత్ర, మిసిమి పత్రికలకు రచనలు కొనసాగింపు, పాత్రికేయ సంఘం కార్యకలాపం. ఉత్తమ జర్నలిస్టుగా అనేక అవార్డులు
--
DOB | 19-09-1919 |
DOD | 05-02-2014 |