శర్మగారు వార్త రాసినా వ్యాఖ్య చేసినా, సంపాదకీయం రాసినా, అలవోకగా ‘రాజధాని ముచ్చట్లు’ వంటి శీర్షికలు రచించినా సత్యనిష్ఠ వీడలేదు. లేఖన మర్యాదలను తప్పలేదు. పత్రికా రచయితకు ప్రజాహితమే పరమ ధర్మం. ఏమి రాసినా ఆ లక్ష్యంతోనే రాశారు. పత్రికా రచనలో పాండిత్య ప్రకర్ష వాంఛనీయం కాదు. రాసింది సుబోధకంగా ఉందా లేదా అన్నదే ప్రధానం. అలా అని నేలబారుగా కూడా ఉండరాదు. పత్రికా రచనను ఉరుకులు పరుగుల మీద సృష్టించిన సాహిత్యం అని కూడా అన్నారు. అంటే రాసింది పాఠక సులభంగానే గాక ఆకర్షణీయంగా, చివరంటా చదివించే విధంగా ఉండాలి. అప్పుడే రాత ప్రయోజనం నెరవేరుతుంది. శర్మగారి ‘ముచ్చట్లు’ అందుకు చక్కటి ఉదాహరణలు
--
| Title | రాజధాని ముచ్చట్లు |
| Writer | మద్దాలి సత్యనారాయణ శర్మ |
| Category | ఇతరములు |
| Stock | 100 |
| ISBN | |
| Book Id | EBO008 |
| Pages | 120 |
| Release Date | 06-Jan-2015 |