ఇతను బహుకాలంగా భారతీయ చరిత్ర, సాహిత్యం, సంస్కృతులపై లోతైన పరిశోధన చేస్తున్నారు. మౌలికమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు, వాటి ఆధారంగా ప్రచలితమై ఉన్న సిద్ధాంతాలను పునః చర్చించి పునర్నిర్వచించే ప్రయత్నం చేస్తున్నారు. పత్రికలు, టెలివిజన్ చానళ్లలో నిశితమైన వ్యాఖ్యానాలకు ప్రసిద్ధుడైన పురుషోత్తమ్ అగ్రవాల్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషనులో సభ్యుడుగా ఎంపికయిన తొలి హిందీ ఆచార్యుడు. అగ్రవాల్ పదిహేడు సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో హిందీ బోధించారు. సంస్కృతి: వర్చస్వ్ ఔర్ ప్రతిరోధ్, తీస్‌రా రుఖ్, విచార్ కా అనంత్, శివదాన్ సింహ్ చౌహాన్, కబీర్: సాఖీ ఔర్ సబద్, నిజ్ బ్రహ్మ విచార్: ధర్మ్, సమాజ్ ఔర్ ధర్మేతర్ అధ్యాత్మ్ పురుషోత్తమ్ అగ్రవాల్ ఇతర రచనలు.