డా. ధీర్ఘాసి విజయ భాస్కర్ రాష్ట్ర స్థాయిలో ఆరుసార్లు నంది అవార్డులు. తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారంతోపాటు, ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డును అందుకున్న నాటక రచయిత. ''బెట్రోల్ట్ బ్రెష్ట్ మహాకావ్య నాటక రంగం - తెలుగు నాటక సాహిత్యం పై దాని ప్రభావం'' అనే అంశంపై పరిశోధన జరిపిన నాటక అధ్యేత. వీరి నాటకలు ఇంగ్లీషు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం, గుజరాతీ, బెంగాలీ, మణిపురి మొదలగు భాషల్లోకి అనువదించబడి ఆయా భాషల్లో ప్రదర్శించబడుతున్నాయి.