డా.కె.ఎస్.కామేశ్వరరావు మూడున్నర దశాబ్దాలకు పైగా విశాఖపట్టణం, అమలాపురం, కాకినాడ కళాశాలల్లో చరిత్ర బోధించారు. కాకినాడ ఐడియల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి చరిత్రశాఖలో రీడరుగా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం 'ఆంధ్రదేశ సమగ్ర చరిత్ర, సంస్కృతి' (8 సంపుటాలు) ప్రచురణకు వర్కింగ్ ఎడిటర్‌గా ఉన్నారు. తొలి, మధ్యయుగాల భారతదేశ, ఆంధ్రప్రదేశ్ సామాజిక-ఆర్థిక చరిత్ర అధ్యయనం కామేశ్వరరావుగారికి ఇష్టమైన అధ్యయన విషయం.