సుప్రసిద్ధ పండితుడూ, సాంస్కృతిక కార్యకర్తా అయిన జి.ఎన్. దేవి మరాఠీ, గుజరాతీ, ఇంగ్లీషు భాషల్లో రచనలు చేస్తున్నారు. ఈ మూడు భాషల్లోనూ తన రచనలకు ప్రతిష్ఠాకరమైన సాహిత్య పురస్కారాలందు కున్నారు, భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఆదివాసీ భాషల పరిరక్షణపై ఉద్యమించారు. పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే అఫ్ ఇండియాకు నేతృత్వం వహించి భారతదేశ భాషల గురించి సంపుటాలు ప్రచురిస్తున్నారు.