-
ఈయన రచనా జీవితానికి షష్టిపూర్తి చేశారు. తన కథలు, నవలల ద్వారా ‘స్ర్తీ-విముక్తి’ ఆవశ్యకతను చాటారు. ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది. భారతీయ సాంస్కృతిక రాయబారిగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే చందమామ పత్రిక తొలి సంచికకు 1947లో కేవలం పదహారేళ్ల వయస్సులో “పొట్టి పిచిక కథ” అనే కథను రాసి పంపారు. ఈయన కొన్ని రచనలు మనం మనుష్యులం,సహజీవన సౌభాగ్యం, ఇంకానా అంతరాలు?, అడుగో మావయ్య, ఆ వెనకే మేరీ, సంపెంగలూ, సన్ంజాజులూ, మేం చేసిన తప్పు మీరూ చేస్తారా?, అది ప్రశ్న, ఇది జవాబు, హెడ్మిస్ట్రెస్ హేమలత, పేకముక్కలు,కథావాహిన – 6, గణిత విశారద, కేటూ, డూప్లికేటూ, అర్ధమున్న కథలు, రామచిలుక, మోహనరాగం,మేథమేట్రిక్స్-1,2,3, అంగ్రేజీ మేడీజీ ఇంకా 20-25. కథల సంపుటాలు.