--
ఏ కథ ప్రత్యేకత దానిదే. తనదైన శైలిలోనే సాగుతుంది. ముఖ్యంగా చివరి కథలో ‘బాహుబలి ఖన్నా’ మనని ఏడిపిస్తాడు. మన గుండెల్లోనే గడ్డకట్టిన కాఠిన్యం, కరుణ రసమై చెప్పలేని చెప్పరాని ఆవేదనతో అశ్రుకణమై కళ్ళల్లోంచి జాలువారుతుంది.
అయ్యా సృష్టికి మూలం ఆనందం. మనిషి పుట్టుకకు మూలమూ ఆనందమే. అందుకే ఆనందానికి మించినదేది ఈ సృష్టిలో లేదు. ఈ సినీ బేతాళ కథలు ఆ ఆనందాన్ని అనంతంగా పాఠకులకు పంచుతాయి.
| Title | సినీ బేతాళ కథలు |
| Writer | డా. కె. వివేకానంద మూర్తి |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | 100 |
| ISBN | 978-93-86763-48-8 |
| Book Id | EBQ066 |
| Pages | 176 |
| Release Date | 30-Dec-2017 |