చరిత్ర శకలాలు
Charitra Sakalaalu
అన్నపూర్ణాపుత్ర
ఈమని శివనాగిరెడ్డి - స్థపతి
Emani Sivanagireddy-Sthapati
మహోన్నత భారతజాతికి ఎంత చరిత్ర ఉందో తెలుగు జాతిలో భాగమైన ఆంధ్రులకు కూడా అంతే చరిత్ర
ఉంది. శిలాయుగం నుంచి విభజన తర్వాత అమరావతి నిర్మాణందాకా ఆంధ్రులకు విలక్షణ చరిత్ర
ఉంది. వైవిధ్యభరితమైన సంస్కృతి ఉంది. అంతేకాదు, అపూర్వమైన ఆలోచనా స్వేచ్ఛకూడా ఉంది.
అందుకే ఈ నేలపైన వైదిక, వైదికేతర విశ్వాసాలు సామరస్యంతో దాదాపు 2500 సంవత్సరాలపాటు
మనగలిగాయి. ప్రకృతి ఆరాధనతో ప్రారంభమైన ఆధ్యాత్మిక చింతన, బౌద్ధం, జైనం, శైవం, శాక్తం,
వైష్ణవం ఇంకా ఎన్నో అనుబంధ తాత్విక భావనగా రూపుదిద్దుకొంది. రాతియుగం నుంచి విజయనగర
కాలందాకా నిరాటంకంగా సాగిన ఆంధ్రుల చరిత్ర, అటుతర్వాత పరాయిపాలనను చవిచూసింది.
సంస్కృతి, సంప్రదాయాలు, విద్య, వైద్య, వాస్తు, శిల్ప, చిత్ర కళలు, సంగీతం, నృత్యం, సాహిత్య
రంగాల్లో ప్రతిభను చాటి, ప్రపంచఖ్యాతిని దక్కించుకొంది.
Title | చరిత్ర శకలాలు |
Writer | ఈమని శివనాగిరెడ్డి |
Category | చరిత్ర |
Stock | 100 |
ISBN | 978-93-86763-36-5 |
Book Id | EBQ057 |
Pages | 192 |
Release Date | 08-Nov-2017 |