--
పి.ఎస్.నారాయణగారికి కథ రాయడం నల్లేరుపై బండి నడకలాగా తోస్తుంది. అలవోకగా చెప్పేస్తారు ఏ కథనైనా. వర్ణనలు తక్కువ. తక్కువనడం కంటే అసలు ఉండవనడం సమంజసమేమో. సరళమైన, చిన్న చిన్న సంభాషణలతో కథను వేగంగా నడుపుతారు. ప్రతి కథలో ఒక సందేశం ఉంటుంది. మనిషి జీవితంలోని అసమర్థతలూ, అశక్తతలూ, దుర్మార్గాలూ ఉంటాయి. అదే సమయంలో సమర్థతా, శక్తతా, మంచితనమూ కూడా ఉంటుంది. పి.ఎస్.నారాయణగారి కథలు విషాదాంతాలు కానేకావు. ఏదో ఒక అనుకూలాంశంతోనే ముగుస్తాయి. రచయిత ఆశావాదానికి ఇది పరాకాష్ఠ. జీవితంలో ఎంత చెడు ఉన్నా చివరికి మనిషికి కావలసింది కాసింత మంచి.
Title | మంచుదుప్పటి |
Writer | పి.ఎస్.నారాయణ |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Not Available |
ISBN | -- |
Book Id | EBJ020 |
Pages | 192 |
Release Date | 17-Sep-2010 |