జంధ్యాల జోక్స్-2
హాస్యబ్రహ్మ జంధ్యాల
Jandhyala Jokes - 2
Jandhyala
హాస్యం పరమౌషధం
తెలుగుకవిత్వం అంటే నన్నయ్య, నాటకం అంటే బళ్ళారిరాఘవ, కార్టూన్ అంటే బాపుగారు గుర్తొచ్చినట్లుగా
హాస్యచిత్రాలంటే జంధ్యాలగారి పేరు చిరస్మరణీయం. తెలుగుచిత్రాల్లో హాస్యం భ్రష్టుపడిపోతున్న సమయంలో
జంధ్యాల రంగప్రవేశంచేసి నాలుగుస్తంభాలాట, రెండురెళ్ళుఆరు, అహనా పెళ్ళంట! లాంటి 40 సినిమాలకి
దర్శకత్వంవహించి సిసలైన హాస్యాన్ని తెలుగువారికి మళ్ళీ గుర్తుచేశారు. ''జంధ్యాల జోక్స్'లోని జోకులన్నీ
ఆయనకు నచ్చినవి, మెచ్చినవి. జెమినీ టీవీలో ప్రసారమైన 'జోక్‌షో'లో వీటిలోని కొన్ని దృశ్యరూపకంగా
వచ్చి లక్షలాది తెలుగు నవ్వులను చూశాయి, కాబట్టి మీరు కూడా ఇవిచదివి మనసారా నవ్వుకోండి. మీరు
నవ్వకూడదని నిర్ణయించుకున్నా, ఈ జోకులేం చిన్నబుచ్చుకోవు, ఎందుకంటే వాటిసత్తాఏమిటో వాటికి
తెలుసు. ఈ పుస్తకంలో అబ్బాయి అమ్మాయిల జోకుల నుండి అత్తగారూ ఆఫీసర్ల దాకా ఉన్నాయి. అందరికీ
ఇది చక్కని టానిక్. కాబట్టి నిరభ్యంతరంగా నవ్వుకోండి.
ఈ పుస్తకం చదివేముందు చిన్న షరా. ఇది స్వంతడబ్బుతో కొన్నవారికే నవ్వుగ్యారంటీ ఇవ్వబడుతుంది.
ఉచితంగా చదివేవారికి ప్రచురణకర్తలు ఎటువంటి హామీ ఇవ్వలేరు. సైకాలజిస్టులు వత్తిడి తగ్గించుకోడానికి
లాఫింగ్ థెరపీని సిఫార్సు చేస్తుంటారు. అందుకే వత్తిడి ఉన్నవారికి ఇది పరమౌషధం.
Title | జంధ్యాల జోక్స్-2 |
Writer | జంధ్యాల |
Category | ఇతరములు |
Stock | 100 |
ISBN | 978-93-85829-25-3 |
Book Id | EBC003 |
Pages | 78 |
Release Date | 01-Jan-2003 |