అనువాదం : ఓలేటి శ్రీనివాస భాను
వ్యాధి సూచనల గురించి చాలామంది కన్నా డాక్టర్ రెడ్డికి చాలా బాగా తెలుసు. అనివార్యమైన దాని గురించి ఆయన భయపడలేదు సరికదా ఆ విషయాన్ని అత్యంత త్వరగా పక్కన పెట్టారు. తనకు మిగిలిన అతి కొద్ది సమయంలో తాను చేయగల విషయాలపై దృష్టిని సారించారు. వాటిలో తన జ్ఞాపకాల సంపుటిని రాయాలన్న నిర్ణయం ఒకటి. దాదాపు ఓ ఏడాది గడిచిన తర్వాత వీడ్కోలు తీసుకోవడానికి వారం రోజులు ముందు, తన జ్ఞాపకాల సంపుటి మొదటి వెర్షన్ ఆయనకి అందింది. అప్పటి ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చాలా హడావుడిగా రూపొందించిన ఆ ప్రతిని, ఆ కవర్ నుంచి ఈ కవర్ వరకు, ఆసుపత్రి పడక మీదే చదివారాయన! పుస్తకం చేతికి అందగానే తీవ్రమైన ఉద్వేగం కమ్ముకొంది. అది కొద్ది క్షణాలే! డాక్టర్ రెడ్డి వెంటనే తేరుకున్నారు. ''నా జీవితం నా చేతుల్లో ఉంది'' అంటూ చిట్టచివరి జోక్ వేశారు! అప్పటికే ఆయన బాగా అలసిపోయారు. లేకుంటే ఎప్పటిలాగే ఆయన నవ్వు బిగ్గరగా వినిపించి ఉండేది!
Title | కలనిజమైతే |
Writer | డా. అంజి రెడ్డి |
Category | చరిత్ర |
Stock | 92 |
ISBN | 978-93-85829-79-6 |
Book Id | EBP008 |
Pages | 296 |
Release Date | 04-Feb-2016 |