Nayaagaraa! Jalamuu Niivee! - Jiivamuu Niivee!
ప్రబోధ్ కుమార్ గోవిల్హిందీ మూలం
ప్రబోధ్ కుమార్ గోవిల్
తెలుగు అనువాదం
డా.టి.(సి) వసంత
నయాగరా! - జలమూ నీవే! జీవమూ నీవే!
తరతరాల నుండి వేదవాఙ్మయం, ఆధునిక సాహిత్యం రెండూ మానవ సమాజాన్ని ఎంతో
ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. సాహిత్యం ఎడారి అయిన మనస్సులలో వసంతాన్ని
తెస్తుంది. మొద్దుబారిన మెదడుకు పదును పెడుతుంది. మనిషి చీకటి బతుకులకు
వెలుగు నిస్తుంది. రచయిత, రచయిత్రులు సమాజానికి దివిటీలు. రచనలు సమాజానికి
హెచ్చరికలు. స్త్రీ – పురుషులలోని భావోద్వేగాలను, వాళ్ళ కోరికలను, వాళ్ళ ఊహలను,
భారతీయ సంస్కృతి పరిమళం అయిన దాంపత్య ప్రేమను, ప్రేయసీ – ప్రియుల ప్రేమ
లోకాన్ని, కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉండే అనుబంధాలు ఆత్మీయ సంబంధాలు,
కుటుంబ వ్యవస్థలో మారుతున్న సంబంధాలు ఎత్తుపల్లాలు మొదలైన వాటిని ఎంతో
ఉదాత్తంగా చిత్రీకరిస్తాడు రచయిత.
Title | నయాగరా! - జలమూ నీవే! జీవమూ నీవే! |
Writer | ప్రబోధ్ కుమార్ గోవిల్ |
Category | అనువాదాలు |
Stock | 100 |
ISBN | 978-93-85829-02-4 |
Book Id | EBO072 |
Pages | 120 |
Release Date | 08-Mar-2015 |