రచన: జైమిని మహర్షి
Written by : JAIMINI MAHARSHI
కూర్పు : కె.ఎస్.ఆర్. కె.వి.వి. ప్రసాద్
Compiled by : K.s.r.k.v.v. Prasad
పూర్వగాథాలహరి
భారతీయ సాహిత్య సంపద అపారం. చతుర్వేదాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు,
అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు, భారత రామాయణ ఇతిహాసాలు, కాళిదాసాది
మహాకవుల కావ్యాలూ భారతీయ సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్యంలో అగ్రస్థానంలో
నిలబెట్టాయి.
మన పురాణేతిహాసాలలో వందలాది కథలున్నాయి. ఆఖ్యానాలూ, ఉపాఖ్యానాలూ
ఉన్నాయి. వేలాది పాత్రలున్నాయి. ఎక్కడో ఒకచోట మాత్రమే వచ్చే పాత్రతో మొదలుకొని
బహు రచనల్లో, అనేక కథల్లో మళ్లీ మళ్లీ వచ్చే పాత్రల వరకు మన ప్రాచీన సాహిత్యంలో
వైవిధ్యభరితమైన పాత్రలు అసంఖ్యాకంగా ఉన్నాయి. అట్లాగే పర్వతాలూ, నదులూ,
పల్లెలూ, పట్టణాలూ, నగరాలూ. భూలోకానికే పరిమితం కాలేదు మనం. స్వర్గ
నరకాలూ ఉన్నాయి. ఏడేడు పధ్నాలుగు లోకాలున్నాయి. దేవతలు, రాక్షసులు, కిన్నర,
కింపురుష, గంధర్వాదులున్నారు. మానవపాత్రలతో పాటు వానరులూ, భల్లూకాలూ,
పక్షులూ ఉన్నాయి.
అసంఖ్యాకమైన ఈ వివరాలూ, వాటి గాథలూ మన సాహిత్యంలో ఎక్కడెక్కడో
ఉన్నవాటిని సంగ్రహంగా ఒక్కచోట కూర్చిన గ్రంథం ‘పూర్వగాథాలహరి’ మన
పురాణేతిహాస సర్వ విషయ సంగ్రహం ఇది. విజ్ఞాన సర్వస్వం వంటి నామ నిఘంటువిది.
ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, సాహిత్యాభిలాష ఉన్న అందరికీ ఎంతో ఉపయోగపడే
గ్రంథం.
Title | పూర్వగాథాలహరి |
Writer | కె.ఎస్.ఆర్. కె.వి.వి. ప్రసాద్ |
Category | ఆధ్యాత్మికం |
Stock | 100 |
ISBN | 978-93-85231-99-5 |
Book Id | EBO071 |
Pages | 712 |
Release Date | 07-Mar-2015 |