--
పతంజలిగా ప్రసిద్ధుడైన కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి పుట్టడం, పెరగడం,
చదవడం, పాత్రికేయవృత్తిలో కాలూనడం ఉత్తరాంధ్రలోనే జరిగింది. ఏడో తరగతి
చదువుతున్నప్పుడే ఓ డిటెక్టివ్ నవలతో రచనారంగంలో ప్రవేశించే ప్రయత్నం చేశారు.
విజయనగరం మహారాజా కళాశాలలో బియ్యే చదివే రోజుల్లో, కళాశాల సెంటినరీ
సావనీర్ సంపాదకవర్గంలో ఒకరుగా వున్నారు. ఆ సావనీర్‌లో ఆయన కథ, కవిత కూడా
అచ్చయ్యాయి. గురజాడని భక్తితో, రావిశాస్త్రిని గురుభక్తితో ప్రస్తావించే పతంజలిపై
సహజంగానే వారి ప్రభావం ఎంతో ఉంది. వారు వేసిన వెలుగుబాటలోనే నడక
ప్రారంభించినప్పటికీ, అతి త్వరలోనే సొంత గొంతు సంతరించుకుని సాహిత్యాన్ని కొత్త
పుంతలు తొక్కించేరు. కేవలం హాస్యం పుట్టించడానికి మాత్రమే కాకుండా రాజ్యంపై,
సమాజంపై తన కోపాన్ని వ్యక్తం చేయడానికి ఆయన వ్యంగ్యాన్ని ఓ ఆయుధంలా
వాడుకోవడం అలవాటు చేసుకున్నారు.
Title | పతంజలి సాహిత్యం -01 |
Writer | పతంజలి |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Not Available |
ISBN | 978-93-85231-07-0 |
Book Id | EBO016 |
Pages | 944 |
Release Date | 14-Jan-2015 |