ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు

Aarogyaaniki Vantinti Chitkaalu

చిట్టిబొట్ల మధుసూదన శర్మ

Chittibhotla Madhusudana Sarma



రూ. 60


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


మన శరీరం ఆహారం వల్ల జనిస్తుంది. ఈ శరీరానికి వచ్చే వ్యాధులు కూడా అపథ్యకర ఆహారసేవనం వల్ల వస్తాయి. కనుక సుఖం (ఆరోగ్యం), దుఃఖం (అనారోగ్యం) అనేవి హితకర, అహితకర ఆహారసేవనపరిణామాలే అని అర్థం. దీన్ని బట్టి ఆహారప్రాధాన్యం ఎంతటిదో మనకు తెలుస్తోంది.
గత నాలుగైదు దశాబ్దా ల క్రితం వరకు కూడా మన బామ్మగారో, అమ్మమ్మగారో, అమ్మగారో, కుటుంబం పెద్దలో మన వంటింట్లోనే లభించే దినుసుల ద్వారా ఏ అనారోగ్యానికి ఏ, ద్రవ్యాన్ని, ఏయే సందర్భాల్లో, ఎలాంటి అనుపానంతో ఏ ప్రమాణంలో, ఎన్నాళ్లు వాడాలో అనుభవపూర్వకంగా ఔషధాన్ని తయారుచేసి చూపిస్తూ, ఉపయోగిస్తూ, అవగాహన కల్పిస్తూ తర్వాతి తరాల వారికి ఆ విజ్ఞానాన్ని అందజేసేవారు.
కాని సమష్టి కుటుంబవ్యవస్థ అస్తవ్యస్తమై, క్రమంగా కనుమరుగవుతూ, న్యూక్లియర్‌ వ్యవస్థ విస్తారమవటంతో, నిరంతరక్రమానుగతమైన ఈ విజ్ఞానప్రక్రియకు అవరోధాలు మొదలయ్యాయి. ఫలితంగా ఇలాంటి చక్కటి మహత్తరమైన అనుభవపూర్వక ఆరోగ్యవిధివిధానాలను తెలుసుకోవటం ఈ తరంవారికి గగనకుసుమమైపోవటం అందరికీ విదితమే. ఫలితంగా ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే హాస్పిటల్‌కు పరుగులు తీసే పరిస్థితి వచ్చేసింది. ఇది నాణేనికి ఒక కోణం.

Books By This Author

Book Details


Titleఆరోగ్యానికి వంటింటి చిట్కాలు
Writerచిట్టిబొట్ల మధుసూదన శర్మ
Categoryసెల్ప్ హెల్ప్
Stock 100
ISBN978-93-85829-03-1
Book IdEBO073
Pages 112
Release Date09-Mar-2015

© 2014 Emescobooks.Allrights reserved
36558

Warning: Use of undefined constant r - assumed 'r' (this will throw an Error in a future version of PHP) in /home/n8hps0619pr6/public_html/emescobooks.com/include/session.php on line 3697
6973