గత రెండు వేల సంవత్సరాలలో భారతీయ ఆలంకారికులు సాహిత్యశాస్త్రంలో శిఖరాయమాణమైన కృషి సల్పి అనేకానేక సిద్ధాంతాలను నెలకొల్పారు. సిద్ధాంత చర్చలకు పోకుండా తాము అంగీకరించిన సిద్ధాంతాలనే గ్రహిస్తూ సమగ్రంగా సాహిత్య లక్షణాన్ని చెప్పే గ్రంథాలు వచ్చాయి. సంస్కృతంలో ప్రతాపరుద్రీయం లాంటివి ఇటువంటివే. తెలుగులో అటువంటి రచనకు కావ్యాలంకార సంగహ్రము ద్వారా శ్రీకారం చుట్టినవాడు రామరాజభూషణుడు.