వ్యాఖ్య: వేదము వేంకటరాయశాస్త్రి
శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ. 1509 నుండి 1529/30 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. సంస్కృతంలోనూ, తెలుగులోనూ రచనలు చేశాడు. తెలుగు కవి పండిత పోషకుడుగా, తెలుగు భాషాభిమానిగా తెలుగువారి ప్రేమను చూరగొన్నాడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడుగా కీర్తి గడించాడు. ఆముక్తమాల్యదా మహాకావ్య రచనతో కవి ప్రపంచంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న రాజకవి ఈయన.
వేదము వేంకటరాయశాస్త్రి
21-12-1853 – 18-06-1929
కళాప్రపూర్ణ, సర్వతంత్రస్వతంత్ర, అభినవ మల్లినాథ, మహామ¬పాధ్యాయ బిరుదాంకితులు. బహుగ్రంథకర్త. నాటక కర్త, విమర్శకుడు, ఆలంకారికుడు, వ్యాఖ్యాత. సంస్కృతం నుండి నాగానంద, రత్నావళి, శాకుంతల, ప్రియదర్శిక, మాళవికాగ్నిమిత్ర, ఉత్తరరామ చరిత్ర, విక్రమోర్వశీయాది నాటకాలు అనువదించారు. ప్రతాపరుద్రీయం వంటి స్వతంత్రనాటకాలు రచించారు. నాటకాల్లో పాత్రోచిత భాషను ప్రవేశ పెట్టారు. ఆముక్తమాల్యద, శృంగారనైషధాలకు ప్రామాణిక వ్యాఖ్యానాలు రచించారు. బహుభాషావేత్త.