కన్యాశుల్కం

Kanyasulakam

గురజాడ వేంకట అప్పారావు

Gurajada Venkata Apparao



రూ. 100


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి
డామిట్‌! కథ అడ్డంగా తిరిగింది
పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్‌
గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.
గురజాడ అప్పారావు గారు (1862-1915) తెలుగు భాష మహా కవి, తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినవారు. గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు. హేతువాది 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు.
వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు వీరి "కన్యాశుల్కం" తెలుగు అన్నిటికన్నా గొప్ప నాటకం అని చెప్పవచ్చు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన వీరు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలోముఖ్యులు. వీరికి "కవి శేఖర" అనే బిరుదు కూడా కలదు.

About This Book


మహాకవి గురజాడ అప్పారావుగారు రచించిన తెలుగులో తొలి ఆధునిక నాటకం కన్యాశుల్కం. ఇటువంటి నాటకం ఆధునిక నాటక చరిత్రలో మరొకటి కానరాదని అభిజ్ఞుల అభిప్రాయం. ఆధునిక సమాజంలోని మంచిచెడ్డలన్నిటినీ రచయిత తన పాత్రల ద్వారా ప్రదర్శిస్తాడు.

Books By This Author

Book Details


Titleకన్యాశుల్కం
Writerగురజాడ వేంకట అప్పారావు
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN978-93-85829-91-8
Book IdEBM038
Pages 268
Release Date31-Jan-2013

© 2014 Emescobooks.Allrights reserved
40494

Warning: Use of undefined constant r - assumed 'r' (this will throw an Error in a future version of PHP) in /home/n8hps0619pr6/public_html/emescobooks.com/include/session.php on line 3697
15762