అమరసందేశం, కూనలమ్మ
శ్రీమాన్ ముదివర్తి కొండమాచార్యులు నెల్లూరు జిల్లా గూడూరు వాస్తవ్యులు. జననం 02.09.1923. మద్రాసు విశ్వవిద్యాలయ ‘విద్వాన్’ పట్టభద్రులు. నెల్లూరు జిల్లా పరిషత్తు ఉన్నతపాఠశాలల్లో 30 సం||లు ప్రధానాంధ్రపండితులుగా పనిచేసి ఉద్యోగ విరమణచేశారు. 1980లో తిరుమల తిరుపతి దేవస్థానంవారి పుస్తక ప్రచురణ విభాగంలో ఉపసంపాదకులుగా చేరి ప్రస్తుతం ఆ విభాగం సంచాలకులుగా పనిచేస్తున్నారు.
వీరు తమ ‘ధర్మదీక్ష’తో కవితావ్రతమారంభించి నలభైకిపైగా పద్య, గద్యకృతులు ప్రచురించారు.
వీరి రచనలు తిరుపతి వేంకటకవులు, శేషాద్రిరమణకవులు, వేటూరి, పింగళి, రాళ్లపల్లి, రాయప్రోలు, విశ్వనాథ, గడియారం వేంకటశేషశాస్త్రి, మధునాపంతుల, పుట్టపర్తి, విద్వాన్ విశ్వం, దివాకర్ల, కరుణశ్రీ, సినారె, దాశరథి, కుందుర్తి, ఆరుద్ర, ఆత్రేయ, గుంటూరు శేషేంద్రశర్మవంటి కవీంద్రుల ప్రశంసలందుకున్నాయి.