నా జీవితంలో తటస్థపడిన అసాధారణ వ్యక్తి వెంకటరత్నం. పుణికి పుచ్చుకున్న వ్యక్తిత్వానికి ప్రతీక. విద్యార్థి దశలోనే విప్లవ భావాలకు పునాదులు వేసుకున్న భావుకుడు. సమాజ పునర్వవస్థీకరణకు చిత్తశుద్ధితో పాటు పడిన సంస్కర్త. విద్యార్థులలో సామాజిక స్పృహను రగిలించి, సాంఘిక మార్పుకు పురిగొల్పిన సాహసశీలి.
సాహిత్యానికి సామాజిక ప్రయోజనం చేకూర్చడంలో కొత్త బాటలు వేసిన సృజనాత్మక శక్తి వెంకటరత్నం. మానవత్వ పరిమళాల్ని తన మాటలలో, రచనల్లోనే గాక నిజ జీవిత ఆచరణలో వెదజల్లిన సౌజన్యమూర్తి.
ఇటువంటి విశిష్టమైన, ఉత్కృష్ఠమైన వ్యక్తి నా విద్యార్థి కావడం గర్వ కారణం… ప్రొ|| కె. వెంకటరెడ్డి.