చిరకాలం ఉద్యమ జీవిగా, మరి చాల కాలం పాత్రికేయుడిగా, అప్పుడూ ఎప్పుడూ బతుకు పోరుకు బొమ్మలు కట్టే కవిగా హెచ్చార్కె తెలుగు సాహితీలోకానికి సుపరిచితులు.
వీథుల్లో, ఇళ్లల్లో, అంతరంగాలలో సాగే సంఘర్షణలు, అవి కల్పించే ఆశ్చర్యాలు, వాటిని చేతిలోనికి తీసుకుని చూసే ప్రయత్నాలు, ప్రయత్నాలలో గెలుపోటములు, సందేహాలు, ధిక్కారాలు, సంతోషాలు, దిగుళ్లు…. హెచ్చార్కె కవిత్వాలు. ‘పరమ సత్యా’ల్ని సైతం సందేహించే సాహసం, బతుకును సెలబ్రేట్ చేసుకునే అన్ని అవకాశాల్ని అందుకోవాలనే జీవన కాంక్ష హెచ్చార్కెను ఇతర్ల నుంచి వేరు చేసి చూపిస్తాయి.
—
‘చీకటిలో దీపం లేకుండా, అడివిలో గొడ్డలి లేకుండా ప్రయాణమా?
పొగ కళ్లలో పడకుండా, విసురుకు చేతి వేళ్లు తెగకుండాజాగ్రత్త’!
ఇటువంటి కవితాపంక్తులెన్నో దీంట్లో అడుగడుగునా అక్షరసత్యాలై దర్శనమిస్తాయి.