--
అజ్ఞానాంధకారంతో అలమటిస్తున్న తెలుగువారికి దారిచూపిన దీపస్తంభం బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు. వారి శిష్య రత్నం తారకంగారు, రామకృష్ణ పరమహంసకు వివేకానందుడులాగా నాయుడుగారికి తారకంగారు లభించారు. నాయుడు గారి ఆశయాలను, లక్ష్యాలను ఆచరణాత్మకంగా ప్రచారం చేసినవారు తారకంగారు. తాను పుట్టుకతో బ్రాహ్మణుడైనా దళితులలో ఒకడై వారిలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసారు తారకంగారు.
”మంచి చెడ్డలు మనుజలందున/యెంచిచూడగ రెండు కులములు/మంచి యన్నది మాలయైతే/మాలనే నగుదున్”
అని గురజాడవారు అంటే దానిని జీవితంలో ఆచరించి చూపినవారు తారకంగారు. – మండలి బుద్ధప్రసాద్
కంభంపాటి రామశాస్త్రి జీవితవిశేషాల మాలిక ఈ జ్ఞాపక దీపిక.
| Title | జ్ఞాపక దీపిక |
| Writer | డా. రాజ్యలక్ష్మి |
| Category | చరిత్ర |
| Stock | 100 |
| ISBN | 978-93-82203-71-1 |
| Book Id | EBM025 |
| Pages | 208 |
| Release Date | 20-Jan-2013 |