Padhyakavitvam:Vasthuvaividyam(1991-2000)
డా. కె.వి.రమణాచారి, ఐ.ఏ.ఎస్.--
వెయ్యేళ్లు తెలుగు సాహిత్య సామ్రాజ్యాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలింది పద్యకవిత్వం. ప్రపంచ సాహిత్యాల్లో దేనికీ తీసిపోని అనర్ఘరత్నాలను అందించింది. ఆధునిక కాలంలో పద్యం స్థానాన్ని వచనం ఆక్రమించినప్పటికీ, కవిత్వ ప్రక్రియల్లో నూతన ధోరణులు ప్రవేశించినప్పటికీ పద్య రచనలు సాగుతూనే ఉన్నాయి. అయితే అవి ఎంత విస్తారంగా ఉన్నాయో సాధారణ పాఠకుడు ఊహించడం కష్టం.
ఒక దశాబ్ద కాలంలో అనేక వందల పద్యరచనలు వెలువడ్డాయని తెలిసినప్పుడు పాఠకులు విస్మితులవటం సహజం.ఈ వందలాది పద్యకావ్యాలను పరిశీలించి, వాటి ఇతివృత్తాలను పరిశోధించి, వాటి వైవిధ్యాన్ని విపులంగా విశ్లేషించిన సిద్ధాంత గ్రంథం ఇది.పద్య కవిత్వాభిమానులకే కాదు తెలుగు సాహిత్యాభిమానులందరికీ పఠనీయ గ్రంథం.సిద్ధాంత గ్రంథమైనా సరసమై కవిత్వంలాగా చదివించే గ్రంథం.
Title | పద్యకవిత్వం:వస్తువైవిధ్యం (1991-2000) |
Writer | డా. కె.వి.రమణాచారి, ఐ.ఏ.ఎస్. |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | 00 |
Book Id | EBI023 |
Pages | 352 |
Release Date | 01-Mar-2014 |