ఎమెస్కో అభిమానుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు వెబ్ సైట్ త్వరలో సిద్ధం అవుతుంది. ప్రస్తుతం వెబ్ టెస్టింగ్ జరుగుతున్నందున ఎవరూ కొనుగోలుకు ప్రయత్నించవద్దు. త్వరలోనే ప్రారంభ తేదిని తెలియపరచుతాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎప్పటి వలెనె అమెజాన్‌లో లభిస్తాయి.    
సైలెంట్‌ సినిమా

Silent Cinema

పసుపులేటి పూర్ణచంద్ర రావు

Pasupuleti Poornachandra Raoరూ. 300


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


సినిమా 1895 లో పుట్టింది. పుట్టిం తర్వాత 32 సంవత్సరాల దాకా మాటలు నేర్వక, ‘నిశ్శబ్ద సినిమా’ గానే జీవించింది! పాశ్చాత్య దేశాల్లో సినిమా 1927 నాటికే మాటలు నేర్చినా, మన భారతదేశంలో మాత్రం 1931 దాకా సినిమా ‘మూకీ’ గానే ఉండిపోరుుంది!
ప్రపంచ సినిమా చరిత్రలో మన దేశం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉందో నిరంతరం గమనిస్తూ ఈ చరిత్రని రాశాను. ఈ ‘సైలెంట్‌ సినిమా’ చరిత్రని 1895 కన్నా ముందే ‘పూర్వ చరిత్ర’తో ప్రారంభించి, 1930 దాకా కొనసాగించాను. అంటే భారతదేశంలో సినిమా ‘మూకీ’గా కొనసాగినంత కాలం అన్నమాట.
అలా సంవత్సరాల ఆధారంగా నా ఈ ‘ప్రపంచ సినిమా చరిత్ర’ ని మూడు భాగాలుగా విభజించాను.
మొదటి భాగం: ‘సైలెంట్‌ సినిమా’ (1895 – 1930)
రెండవ భాగం: ‘మాటల-పాటల సినిమా’ (1931 – 1970)
మూడో భాగం: ‘ఆధునిక సినిమా’ (1971 – 2000)
సినిమా చరిత్రకు నిజానికి ముగింపంటూ ఉండదు. అది నిరంతరం నడిచే చరిత్ర; పరుగెత్తే చరిత్ర; ప్రవాహం లాంటి చరిత్ర..! అలా నిరంతరం ప్రవహించే చరిత్ర వెనక అలుపులేకుండా పరుగెత్తడం ఏ ఒక్క వ్యక్తికీ సాధ్యంకాని పని!

Books By This Author

Book Details


Titleసైలెంట్‌ సినిమా
Writerపసుపులేటి పూర్ణచంద్ర రావు
Categoryఇతరములు
Stock 100
ISBN978-93-83652-74-7
Book IdEBN035
Pages 680
Release Date25-Jan-2014

© 2014 Emescobooks.Allrights reserved
17925
165