ఆంగ్లమూలం :- మల్లంపల్లి సోమశేఖర శర్మ
అనువాదం :- కాకాని చక్రపాణి, దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి, గోవిందరాజు చక్రధర్, జనప వెంకటరాజం
‘డిగ్రీలు’ లేని పాండిత్యంబు వన్నెకు
రాని యీ పాడుకాలానఁ బుట్టి
నీ చరిత్రజ్ఞాన నిర్మలాంభఃపూర
మూషరక్షేత్ర వర్షోదక మయి
చాడీలకు ముఖప్రశంసల కీర్ష్యకు
స్థానమైనట్టి లోకాన నుండి
నీయచ్ఛతర కమనీయశీల జ్యోత్స్న
అడవి గాసిన వెన్నెలగుచుఁ జెలఁగి
అంతె కాని గౌరీశంకరాచ్ఛశృంగ
తుంగము త్వదీయము మనస్సు పొంగి తెలుఁగు
నాఁటి పూర్వచరిత్ర కాణాచి యెల్ల
త్రవ్వి తల కెత్తలేదె యాంధ్రజనములకు.
- విశ్వనాథ