--
వాసుదేవుడు సంకర్షణరూపంలో ప్రళయ సమయంలోనే విజృంభిస్తాడు. కాని రుద్రుడా విధంగా కాదు. మహాకాలుడు, కాలకాలుడు కాబట్టి – ఎల్లవేళలా ఎల్లరూపాలలో ప్రళయతాండవం చేస్తూనే ఉంటాడు. అందుచేత శాంతికాముకులైన వేదకాలంనాటి మహర్షులు దర్శించిన రుద్రవిభూతులకన్నిటికి నమస్కరిస్తూ అతని మూర్తిని సలిలాభిషేకంతో చల్లబరుచుతూ ప్రార్థించినారు. అందుచేత ఆనాడు వారు దర్శించిన ఋక్కులీనాడు మనకు నమకచమకాల పేర రుద్రాభిషేక మంత్రాలుగా నిలిచినవి.
| Title | శ్రీ రుద్రాధ్యాయము |
| Writer | కపిలవాయి లింగమూర్తి |
| Category | ఆధ్యాత్మికం |
| Stock | 100 |
| ISBN | 978-93-80409-86-3 |
| Book Id | EBK042 |
| Pages | 208 |
| Release Date | 05-Feb-2011 |